KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు

Supreme Court Dismisses KTR Petition
x

KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు

Highlights

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తన పిటిషన్ ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 8న సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సీజేఐను కేటీఆర్ న్యాయవాది కోరారు.

అయితే ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. జనవరి 15న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని సీజేఐ తెలిపారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఫార్మూలా ఈ కారు రేసులో ప్రభుత్వ ధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని, అవినీతి జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ వాదనలతో ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ విబేధించారు.ఫార్మూలా ఈ రేసుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఆయన ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసు నిర్వహణతో ఎవరికి లాభం జరిగిందో దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారని రోహత్గీ వాదించారు. రాజకీయ కారణాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దీంతో . అయితే అదే సమయంలో తమకు హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కేటీఆర్ తరపు న్యాయవాది అభ్యర్ధించారు.తాము దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories