తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు
x
Highlights

* కోర్‌ కమిటీ సభ్యులతో పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మంతనాలు * ఇప్పటికే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి రావాలన్న అధిష్టానం * తెలంగాణ సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ మాట్లాడే అవకాశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కోసం హై కమాండ్ కసరత్తులు చేస్తోంది. సరైన నాయకుడి కోసం కాంగ్రెస్ సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. కోర్‌ కమిటీ సభ్యులతో పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి రావాలని కోరారు. ఆయనతో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, వీహెచ్, గీతరెడ్డి, జీవన్ రెడ్డిలతో వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. వారి అభిప్రాయం తీసుకోసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలో తెలంగాణ సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ మాట్లాడే అవకాశం ఉంది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీపై, నేతలపై సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో వీహెచ్ ఏఐసీసీకి వివరణ పంపారు. దురేద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదని వీహెచ్ అన్నారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని వీహెచ్ లేఖలో పేర్కొన్నారు. త్వరలో రాహుల్ గాంధీ వీహెచ్‌తో మాట్లాడనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories