Sunitha Jagadish Reddy: ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష

Sunitha Jagadish Reddy Door-to-Door Campaign in Suryapet
x

Sunitha Jagadish Reddy: ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష 

Highlights

Sunitha Jagadish Reddy: బీఆర్ఎస్‌కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది

Sunitha Jagadish Reddy: పేద,మధ్యతరగతి ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. రాయని గూడెంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు నృత్యాలతో సునీత జగదీష్ రెడ్డి కి స్వాగతం పలికారు. ప్రతీ కుటుంభం ఆనందంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిల ఆకాంక్ష అని .. గతంలో బీఆర్ఎస్ కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు.

మరోసారి గెలిపిస్తే బీమా ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్‌లతో మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలన్ని లభిస్తాయన్నారు. ఇక సూర్యాపేటలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న సునిత జగదీష్ రెడ్డి ..ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే దీనికి నిదర్శనం అన్నారు. ఈ నెల 30 న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మంత్రి జగదీష్ రెడ్డి గెలిపించాలని కొరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories