Telangana: ఏప్రిల్ 27 నుంచి వేస‌వి సెల‌వులు

Telangana: ఏప్రిల్ 27 నుంచి వేస‌వి సెల‌వులు
x
Highlights

Telangana: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Telangana: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈనెల 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికే టెన్త్‌ పరీక్షలు రద్దుచేసి విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. ఇక స్కూల్స్‌, కాలే‌జ్‌ల ఓపెన్‌పై జూన్‌ 1 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి సబిత. ఏప్రిల్ 26న ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ 19 పరిస్థితిని పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories