Subhash Reddy: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సుభాష్‌రెడ్డి కంటతడి

Subhash Reddy Emotional
x

Subhash Reddy: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సుభాష్‌రెడ్డి కంటతడి

Highlights

Subhash Reddy: కాంగ్రెస్‌కు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి రాజీనామా

Subhash Reddy: హస్తం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి టికెట్‌ మదన్‌మోహన్‌కు ఇవ్వడంపై వడ్డేపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. టికెట్‌ ఇవ్వకపోవడంతో కార్యకర్తల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు వడ్డేపల్లి. దీంతో.. అధిష్టానం తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ మారాలని సుభాష్‌రెడ్డి అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో సుభాష్‌రెడ్డి బీజేపీకి వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories