తాతగారి మోటారు బండి.. జోరు చూడండి !

తాతగారి మోటారు బండి.. జోరు చూడండి !
x
Highlights

నగరాలు పట్టణాల్లో బైక్‌లపై తిరిగే యువతకు సమానంగా పోటీ పడుతున్నాడు ఓ తాత. ఆధునాతన బైక్ నడుపుతూ అందరిని ఆకట్టుకుంటున్న ఆ తాత ఇప్పుడు స్టైలీష్ స్టార్‌గా మారారు.

నగరాలు పట్టణాల్లో బైక్‌లపై తిరిగే యువతకు సమానంగా పోటీ పడుతున్నాడు ఓ తాత. ఆధునాతన బైక్ నడుపుతూ అందరిని ఆకట్టుకుంటున్న ఆ తాత ఇప్పుడు స్టైలీష్ స్టార్‌గా మారారు. ఇంతకు ఆ తాత వాడుతున్న బైక్‌కు అంత క్రేజ్ ఎందుకో ఇప్పుడు చూద్దాం.

ఆధునికతకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త తరహాలో తయారైన ఈ బైక్ అందర్ని ఆకట్టుకుంటుంది. పెట్రోల్ డీజిల్ లాంటివి అవసరం లేకుండా ఒక సారి ఛార్జింగ్ పెడితే నాలుగు రోజుల పాటు ఈ బండిని రైడ్ చేయవచ్చు . రామడుగు మండలం వెంకటగిరికి చెందిన లింగయ్య వ్యవసాయ భూమికి వెళ్లి రావడానికి ఈ బైక్ ఉపయోగిస్తున్నాడు. ఇదే బండిపై వ్యవసాయానికి అవసరమైన యూరియా బస్తాలు కానీ ఇతర పని ముట్లు కానీ తీసుకు వెళ్తున్నట్లు చెబుతున్నాడు. లింగయ్య వాడుతున్న ఈ బైక్ ను తెచ్చుకునేందుకు ఆరా తీస్తున్నారు ఇతరులు. ఈ చిన్ని బైక్ స్టైల్‌గా రైడ్ చేస్తూ రోడ్డుపై దూసుకెళ్తుండటంతో అంతా విచిత్రంగా చూస్తూ లింగయ్య తాత సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. రామడుగు మండలంలోనే లింగయ్య ఓ ఐకాన్‌గా మారిపోయాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories