Telangana: ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడ గిరిజన బాలికల హాస్టల్‌లో దెయ్యం కలకలం

Students Fear to Ghost in Tribal Girls Hostel in Mamidiguda Adilabad
x

మామిడిగూడ గిరిజన బాలికల హాస్టల్‌లో దెయ్యం కలకలం(ఫైల్ ఫోటో)

Highlights

*దెయ్యం దాడి చేసిందంటూ విద్యార్థిని ప్రచారం *భయంతో పరుగులు తీసిన తోటి విద్యార్థులు *హాస్టల్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు

Telangana: ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడలోని గిరిజన బాలికల హాస్టల్‌లో నిజంగానే దెయ్యముందా? పిల్లలు దెయ్యాన్ని చూశారా? ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది. అసలు అక్కడేం జరుగుతోంది? హాస్టల్లోని ఓ విద్యార్థినిపై మొన్న రాత్రి అనుమానాస్పదంగా దాడి జరిగింది.

దీంతో ఆ విద్యార్థిని తనపై దెయ్యం దాడి చేసిందని కేకలు వేయడంతో అక్కడున్న మిగితా విద్యార్థులు కూడా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు గాయాలపాలు కూడా అయ్యారు.

అయితే ఆ విద్యార్థినికి గత కొన్నిరోజుల నుంచి భయంకరమైన శబ్దాలు, వింత ఆకారాలు కనిపిస్తున్నాయని తోటి విద్యార్థులకు చెప్పిందట. దీంతో వాళ్లంతా కూడా భయంతో ఎన్నో రాత్రులు గడిపారని చెబుతున్నారు. ఇక మొన్న జరిగిన ఘటనతో స్కూల్‌ నుంచి పిల్లలు బయటకు వచ్చేశారు.

ఈ విషయంలో తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు హాస్టల్ కి వెళ్లి ఘటనపై అరా తీశారు. దెయ్యం భయం ఏమి లేదని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇక స్కూల్లో దెయ్యం ఉందంటూ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు గ్రామ పెద్దలు. అపోహలు విని పిల్లల భవిష్యత్‌ నాశనం చేయొద్దని చెబుతున్నారు. పిల్లలకు ఏం జరగకుండా తాము కాపలాగా ఉంటామంటున్నారు. అనవసరంగా రూమర్స్‌ నమ్మి పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం మూర్ఖత్వమని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories