పాసుల జారీలో పోలీసులు కఠినం.. ఇక నుంచి వారికి మాత్రమే..

పాసుల జారీలో పోలీసులు కఠినం.. ఇక నుంచి వారికి మాత్రమే..
x
Highlights

కరోనా కట్టాడిలో భాగంగా వచ్చే నెల 3వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. అయినప్పటికీ కొందరు ఉల్లంఘించి యధేచ్చగా బయట తిరుగుతున్నారు.

కరోనా కట్టాడిలో భాగంగా వచ్చే నెల 3వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. అయినప్పటికీ కొందరు ఉల్లంఘించి యధేచ్చగా బయట తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు తగు మార్గదర్శకాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయట తిరిగేవారు పాసులు తీసుకోవాలని సూచించారు.

లాక్‌డౌన్‌ పాసుల జారీలో సైబరాబాద్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. బంధువులు చనిపోయినప్పుడు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉంటేనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారికోసం ఉచితంగా అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చారు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌.

అత్యవసరంగా ఊరెళ్లాలి అనుకునే వారికి ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తూ వచ్చారు. ప్రతి రోజు ఇలా వందల్లో పాసులు జారీ చేస్తున్నారు సైబరాబాద్‌ కొవిడ్‌-19 కంట్రోల్‌ రూం సిబ్బంది. అయినా పాసులు కోరే వారు పెరుగుతూనే ఉన్నారు. అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ లో పాస్‌లు ఇవ్వొద్దన్నారు. దీంతో అందరూ గచ్చిబౌలిలోని సీపీ కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. అవసరం లేకున్నా పాసులు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వల్ల అత్యవసరం ఉన్న వాళ్లు ఇబ్బంది పడకూడదని నిర్ణయించి, వారి కారణాలు సరిచూసుకొన్న తర్వాతే పోలీసులు పాసులు జారీ చేస్తున్నారు.

తెలంగాణలో కరోనా వైర‌స్ ద‌డ‌పుట్టిస్తుంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజు 66 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బులెటిన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 700 కేసులు ఉండ‌గా.. తాజాగా పెరిగిన కొత్త కేసుల‌తో 766కు చేరాయి. ఈ రోజు ఎవ‌రు డిశ్చారి కాలేదు. గురువారం వ‌ర‌కు డిశార్జ్ అయిన‌వారి సంఖ్య 187 వ‌ర‌కు ఉంది. 18మంది మ‌ర‌ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories