సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Strict Arrangements For Secunderabad Ujjaini Bonalu
x

సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Highlights

Secunderabad: వందకు పైగా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సిసి కెమెరాలు, కమాండ్ కంట్రోలింగ్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు పలు సూచనలు జారీ చేస్తుంటారు.

సికింద్రాబాద్ మహాంకాళి బోనాల జాతరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారం రోజుల ముందు నుంచే భద్రత పై రివ్యూ చేశారు. మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి ఆలయం తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

బోనాలు సమర్పించడానికి వస్తున్న మహిళా భక్తులు ఎక్కువ మంది వస్తున్న క్రమంలో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. వివిఐపి తాకి డికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు అమ్మవారిని దర్శించుకోడానికి వస్తున్న క్రమంలో మహిళా పోలీస్ సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 3వేల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వందకి పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణంగా పరిశీలించనున్నారు. మహిళలను వేధించకుండా షీటీమ్స్ బృందాలు కూడా రంగంలోకి దింపనున్నారు.

అదేవిధంగా వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అందించేందుకు 6 లక్షల వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. బోనాల జాతరలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఆంక్షలు అదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రారంభమవుతాయని తిరిగి మరుసటి రోజు పూజలు పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. సికింద్రాబాద్ లో పలు రూట్లల్లో ట్రాఫిక్ దారి మళ్ళించారు. మినిస్టర్ రోడ్, కర్బలా మైదాన్, ఆర్టీసీ బస్ లు సాధారణ ట్రాఫిక్ ను రాణిగంజ్ చౌరస్తా వైపు దారి మళ్లిస్తారు. బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు. ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు. ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు.

అమ్మావారిని దర్శించుకోవాడానికి వచ్చే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాడానికి సదుపాయాలు కల్పించారు. సుభాష్ రోడ్డు ప్రాంతాల నుంచి వచ్చే వారు వాహనాలను ఓల్డ్ జిల్‌ఖానా ఓపెన్ ప్లేస్‌లో పార్క్ చేయాలి. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వచ్చే భక్తులు వాహనాలు ఇస్లామియా హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలి. సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్, మహబూబీయ కాలేజీలో పార్క్ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories