Top
logo

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి
Highlights

ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిలర్ పదవుల కోసం పోటీ చేసిన అభ్యర్థుల...

ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిలర్ పదవుల కోసం పోటీ చేసిన అభ్యర్థుల భవిత్యం మరో 24 గంటల్లో తేలనుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గాను 6 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 17 వార్డులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లను స్థానిక జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో పోలీసుల పహారాలో భద్రపరిచారు. సాయుధ పోలీసులతో పాటు ఎస్ఐ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాల ప్రాంగణాలు అన్ని సీసీ కెమెరాల తో నిఘా ఉంచారు. మున్సిపాలిటీకి ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహించారు.

పట్టణంలోని 17 వార్డులకు 32 పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో 18,321 మంది ఓటర్లకు గాను 14,859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపుకు మూడు కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే బారికేడ్లు,ఇనుప జాలిలు, గుర్తుల వారీగా బాక్సులు, రౌండ్లు వారీగా టేబుల్ లను సిద్ధం చేశారు.

మొదటి రౌండ్లో 7 వార్డు లకు సంబంధించిన ఓట్లు, రెండవ రౌండ్లో ఆరు వార్డుల కు సంబంధించిన ఓట్లు, చివరి మూడో రౌండ్లో నాలుగు వార్డులకు సంబంధించిన ఓట్లను అధికారులు లెక్కించి ఫలితాలు తెలపనున్నారు.

Web TitleStrict Arrangements for Municipal elections 2020 counting in Telangana
Next Story