Nagarkurnool: తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు: ఎస్పీ సాయిశేఖర్

Nagarkurnool: తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు: ఎస్పీ సాయిశేఖర్
x
ఎస్పీ సాయిశేఖర్
Highlights

నాగర్ కర్నూల్: ఏ మతం వారైనా ఇతర మతస్థులను, వారి మతాన్ని కించపరిచే విధంగా కానీ, మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా కానీ, వారి మనోభావాలను కించ పరిచే...

నాగర్ కర్నూల్: ఏ మతం వారైనా ఇతర మతస్థులను, వారి మతాన్ని కించపరిచే విధంగా కానీ, మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా కానీ, వారి మనోభావాలను కించ పరిచే విధంగా కానీ ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియా అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేసినా ఒక మతాన్ని ఎక్కువ చేస్తూ, మరో మతాన్ని తక్కువ చేస్తూ ప్రచారం చేసినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సాయిశేఖర్ తెలిపారు.

ఒక మతాన్ని తక్కువ,మరో మతాన్ని ఎక్కువ చేసే విధమైన వార్తలను సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నా, అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, అట్టి వారికి నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున జిల్లా ప్రజలంతా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి, ఇబ్బందులు పడవద్దని కోరుతున్నామని ఎస్పీ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories