తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీలు

తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీలు
x
Highlights

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే కొంత మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే కొంత మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మూడేళ్లకు పైగా అక్కడే తన విధులను కొనసాగిస్తున్నారని, వారిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణా సీఈఓ ఆయనతో పాటు మరికొందరు కలెక్టర్ల బదిలీలను చేయాలని సూచించారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ముగ్గురు కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. స్థానచలనం అయిన వారిలో మెదక్ కు హన్మంత రావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హోలీకెరీని కలెక్టర్లుగా నియమించారు. ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల జిల్లా అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్టా పట్నాయక్‌కు అప్పగించారు. పెద్దపల్లి అదనపు బాధ్యతలు కరీంనగర్ కలెక్టర్ శశాంకకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories