Telangana: తెలంగాణ ఆదివాసీ గిరిజనులకు కేసీఆర్ దసరా కానుక

ST Quota Hiked To 10 Percent In Telangana Orders Issued
x

Telangana: తెలంగాణ ఆదివాసీ గిరిజనులకు కేసీఆర్ దసరా కానుక 

Highlights

Telangana: రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ ఉత్తర్వులు

Telangana: తెలంగాణ సర్కారు ఆదివాసీ గిరిజనులకు దసరా కానుక అందించింది. రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారికంగా ఉత్తర్వులను జారీచేశారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులతో గిరిజనులకు దసరా కానుకగా అందించారు. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇదివరకున్న ఆరుశాతం రిజర్వేషన్లు ఇవాల్టినుంచి పదిశాతానికి పెంచుతున్నట్లు జీవో 33ను విడుదలచేశారు. సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతిభవన్‌కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల కు సంబంధించిన ప్రతిపాదనల దస్త్రానికి ఆమోదం తెలిపారు. సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొత్త జీవో ప్రకారం రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త రిజర్వేషన్లు గిరిజనులకు విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. బీసీల్లో గ్రూపుల వారీగా చూస్తే... BCలో A గ్రూపు-7శాతం, B కేటగిరి-10శాతం, C గ్రూప్ ఒకశాతం, D కేటగిరి-7శాతం, E కేటగిరి కింద 4 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఆర్థికంగా వెనుక బడిన తరగతులవారికి 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

దసరా కానుకగా గిరిజన రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారని తెలంగాణలో పలుచోట్ల సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ గిరిజనులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ స్వీట్లను పంచిపెట్టారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Show Full Article
Print Article
Next Story
More Stories