Top
logo

ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను తీసుకుంటే 50 వేల జరిమానా

ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను తీసుకుంటే 50 వేల జరిమానా
X
Highlights

తెలంగాణ సర్కార్ కు జనగామ జిల్లాలోని ఓ గ్రామం ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను ఎవరైనా తీసుకుంటే 50 వేల...

తెలంగాణ సర్కార్ కు జనగామ జిల్లాలోని ఓ గ్రామం ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను ఎవరైనా తీసుకుంటే 50 వేల జరిమానాతో ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గ్రామ పంచాయితీ గొల్ల కురుమలకు నోటీసులు జారీ చేసింది.

గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక చేపట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలతో తో గ్రామంలోని పంట పొలాలకు నష్టం కలుగుతుందని జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామ పంచాయితీ తీర్మానం చేసింది. సర్కార్ గొర్లను తీసుకునేవారికి 50 వేల జరిమానాతో ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించింది. గొల్ల కురుమలకు గ్రామ పంచాయితీ నోటీసులు జారీ చేసింది.

శ్రీపతిపల్లి గ్రామ పంచాయితీ తీర్మానంపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీ భవనంలోకి గొర్రెలను పంపించి నిరసన తెలిపారు. తమ జీవనోపాధిని దెబ్బతీసే తీర్మానాన్ని గ్రామ పంచాయితీ వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని యాదవ సంఘాల నాయకులు హెచ్చరించారు. గ్రామస్తుల డిమాండ్ మేరకే గొర్రెలను తీసుకోరాదని గ్రామ పంచాయితీ తీర్మానం ఆమోదం చేసిందని శ్రీపతిపల్లి సర్పంచ్ చెబుతున్నారు. ఆదర్శ గ్రామంలోభాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే గ్రామంలో గొర్రెలను మేపేందుకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తామని చెబుతున్నారు.

Next Story