Srinivas Goud: పొలంలో దిగి నాటేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud Planted In The Paddy Field
x

Srinivas Goud: పొలంలో దిగి నాటేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

Highlights

Srinivas Goud: గొర్రుతో కరిగెట, ఎరువు చల్లిన మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ దారిన వెళ్తూ.. పొలంపనులు చేస్తున్న రైతులతో మాట్లాడి వారితో మమేకమయ్యారు. హన్వాడ నుంచి మహబూబ్ నగర్ వెళ్తూ పొలంలోకి దిగిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, చిన్నదర్పల్లికి చెందిన బాలకిషన్ రావు అనే రైతుతో కలిసిన పొలం పనుల్లో పాలుపంచుకున్నారు. పొలంలో వరి నాట్లు వేస్తుండగా... పొలంలో దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గొర్రుతో కరిగెట చేశారు. ఎరువు చల్లారు. రైతులతో కలిసి నాట్లు వేశారు.

స్వయంగా మంత్రి పొలంలో దిగి నాటు వేయడంతో రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.

ఉచితంగా నిరంతరంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలని అన్నదాతను ఆగం చేసేందుకు కుట్ర చేస్తోందని అక్కడున్న రైతులతో మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories