Srinivas Goud: రేవంత్‌రెడ్డి రైతులపై విషం చిమ్ముతున్నరన్న శ్రీనివాసగౌడ్

Srinivas Goud Fire On Revanth Reddy
x

Srinivas Goud: రేవంత్‌రెడ్డి రైతులపై విషం చిమ్ముతున్నరన్న శ్రీనివాసగౌడ్

Highlights

Srinivas Goud: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాగౌడ్ ఫైర్

Srinivas Goud: ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న క్రమంలో వారిపై రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు రైతులను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. ప్రజలు ఇలాంటి నేతలకు బుద్ధి చెప్తారన్నారు. ఎవరెన్ని చెప్పినా తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, ఎన్ని ఆటంకాలు వచ్చినా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఆగదన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories