ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

Speeding that took a life the bike lost control and hit the divider
x

ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

Highlights

* ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం.. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు

Road Accident: అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈసీఐఎల్‌ నుంచి రాధిక చౌరస్తా వైపు వెళ్తుండగా బైక్‌ డివైడర్‌ను ఢికొట్టింది. దీంతో యువకుడు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories