వసంత పంచమి విశిష్టత...

వసంత పంచమి విశిష్టత...
x
Highlights

వసంత పంచమి ఏర్పాట్లతో బాసర క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. నిర్మల్‌జిల్లాలోని బాసర సరస్వత ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

వసంత పంచమి ఏర్పాట్లతో బాసర క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. నిర్మల్‌జిల్లాలోని బాసర సరస్వత ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి అమ్మవారి పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారి కోసం ఆలయ కమిటీ సకల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను, భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది.

వసంత పంచమి ఎప్పుడు జరుపుతారు.. ఎందుకు జరుపుతారు..

మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది, ఇదే రోజున చదువుల తల్లి సరస్వతి పుట్టిన రోజు కాబట్టి దాన్ని ఈ వేడుకలను మాఘశుద్ధ పంచమి రోజున జరుపుతారు. దీన్నే వసంత పంచమి అని పిలుస్తారు. అంతే కాదు ఈ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున చదువుల తల్లి సరస్వతి దేవి కి పూజ చేస్తే విద్యాప్రాప్తి లభిస్తుందని ప్రజల నమ్మకం.

వసంత పంచమి విశిష్టత

అన్నివిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, పెన్నులను అమ్మవారి దగ్గర పెట్టి మాఘపంచమి రోజున పూజిస్తారు. అంతే కాదు ఈ అమ్మ దగ్గర అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు జ్ఞాన సిద్ధి అభిస్తుందని భక్తులు నమ్ముతారు. చదువుల తల్లి సరస్వతిని ఆరాధిస్తే వాక్సుద్ధి కలుగుతుందనే నమ్మకం. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్వరూపమే శ్రీ శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు.

అమ్మవారిని ఎలా పూజిస్తారు..

ఈ తల్లిని ''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూ ఆరాధిస్తే చాలు ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని అర్చకులు చెపుతుంటారు. ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు.

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః

విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః

శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః

Show Full Article
Print Article
More On
Next Story
More Stories