డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి లాక్ డౌన్ బ్రేకులు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి లాక్ డౌన్ బ్రేకులు
x
Highlights

హైదరాబాద్ నగర పేదల కోసం సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి లాక్ డౌన్ బ్రేకులు వేసింది. జులై మాసంలో పనులన్నీ పూర్తి...

హైదరాబాద్ నగర పేదల కోసం సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి లాక్ డౌన్ బ్రేకులు వేసింది. జులై మాసంలో పనులన్నీ పూర్తి కావాల్సి ఉండగా కూలీల వలసల కారణంగా పనులు మందగించాయి. దీంతో పనులు పూర్తికావటానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. గ్రేటర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

హైదరాబాద్ మహా నగర పేదల కోసం కొల్లూరు, తెల్లపూర్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. జులైలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా...కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు స్వంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. నిర్మాణ సంస్థలు ఎంత చెప్పినా కూలీల వలసలు ఆగలేదు. ఈ కారణంగా నిర్మాణ పనుల్లోఉన్న కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. లాక్ డౌన్ ముందు రోజుల్లో నాలుగు వేల మంది కూలీలు పనిచేసేవారు. ప్రస్తుతం 1500 మంది కూలీలు మాత్రమే పని చేస్తున్నారు.

కొల్లూరు టౌన్ షిప్ 1, టౌన్ షిప్ 2 గా భవన సముదాయాలను నిర్మిస్తున్నారు. టౌన్ షిప్ 1 లో మొత్తం 14 బ్లాకులను నిర్మిస్తున్నారు. 9 ఫ్లోర్లు ఉంటాయి. ఇందులో 2052 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఏర్పాటు చేశారు. సెల్లార్ పార్కింగ్, స్టిల్ట్ పార్కింగ్ ఉంటుంది. ఈ సముదాయానికి 38 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. బెంగుళూర్ కు చెందిన కేబీఆర్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ ఈ నిర్మాణాన్ని చేపడుతోంది.

టౌన్ షిప్ 1 నుండి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు గ్రామంలొనే టౌన్ షిప్ 2 ను నిర్మిస్తున్నారు. ఇది కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. టౌన్ షిప్ 2 లో 117 బ్లాక్ లు ఉన్నాయి. సెల్లార్, స్టిల్ట్ పార్కింగ్ లతో కలుపుకుని కొన్ని 10, మరికొన్ని 11 అంతస్తులు ఉన్నాయి. వీటిలో మొత్తం 15,560 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉంటాయి. అంటే ఫ్లాట్ కు నలుగురు చొప్పున 62,240 మంది ప్రజలు ఇక్కడ నివాసం ఉండబోతున్నారు. టౌన్ షిప్ 2 లో మొత్తం 234 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు చెందిన డీఈసి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ టౌన్ షిప్ 2 ను నిర్మిస్తోంది.

ఇంతమంది నివసించబోయే ఈ టౌన్ షిప్ లలో షాపింగ్ కాంప్లెక్స్ లు, ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, అంగన్ వాడి కేంద్రాలు, అండర్ గ్రౌండ్ సంప్ లు, సబ్ స్టేషన్ లు, ఇంటిగ్రేటెడ్ వెజ్ టేబుల్, నాన్ వెజ్ మార్కెట్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులలో పనులు దాదాపు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మరో 15 శాతం వరకు పనులు మిగిలి ఉన్నాయి. బిల్డింగ్ పనులు పూర్తవ్వగా అంతర్గత రోడ్లు, ఎలక్ట్రికల్ వర్క్స్, పెయింటింగ్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈ సమయానికల్లా పనులు పూర్తయ్యేవని, కూలీల కొరత కారణంగా పనులు పూర్తి కావడానికి మారో మూడు నెలల సమయం పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories