Telangana: పురాతన ఆలయాలు అద్భుతాలకు చిహ్నాలు

Special Old Shiva Temple In Wanparthi District Kalvarala
x
కాల్వరాల శివాలయం (ఫైల్ ఫోటో)
Highlights

Telangana: అప్పటి శిల్పుల కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు

Telangana: పురాతన ఆలయాలు అద్భుతాలకు చిహ్నాలు అప్పటి శిల్పుల కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. ఆలయ ప్రాకారం నుంచి శిల్పాల ఆకారం వరకు అందంగా తీర్చిదిద్దుతారు. పైగా ఆ ఆలయానికి ఓ అద్భుతాన్ని జోడించి ప్రత్యేకత తీసుకువస్తారు. అలాంటి అద్భుతంతో వెలుగోందుతోంది వనపర్తి జిల్లాలోని ఓ పురాతన శివాలయం మరీ ఆ ఆలయానికి ఉన్న స్పెషాలిటీ ఎంటో తెలుసుకుందాం.

ఈ పురాతన శివాలయం. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో కొలువై ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో అద్భుతాలు ఈ ఆలయానికి సొంతం. ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. అప్పటి శిల్పుల సూర్యగమనాన్ని పరిశీలించి ఎంతో నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఇక ఆలయ స్తంభాలు ఏకశిలతో చెక్కబడి ఉన్నాయి. భారతదేశంలో కేవలం ఏడు దేవాలయాల్లోనే సూర్యకిరణాలు పడతాయి. అందులో ఒకటి కల్వరాల గ్రామంలోని ఈ శివాలయమని స్థానిక భక్తులు చెబుతున్నారు.

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వేళల్లో చాలా దేవాలయాల ద్వారాలను మూసివేస్తారు. కానీ ఈ శివాలయంలో మాత్రం సూర్యగ్రహణం వేళ కూడా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తారు. ఇక్కడి లింగం చుట్టూ సూర్యుడు ప్రదక్షిణలు చేస్తాడని స్థానిక భక్తుల నమ్మకం. ఎన్నో ప్రత్యేకతను కలిగిన ఈ శివాలయాన్ని పాలకుల గుర్తించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories