నగరంలో మహిళలు, యువతులు కోసం ప్రత్యేక జాబ్ మేళా

Special job fair for women and girls in the city
x

ఫైల్ ఇమేజ్


Highlights

OU Campus:సిటీ పోలీస్ షి టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులు కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించారు.

హైదరాబాద్: సిటీ పోలీస్ షి టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులు కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణా లో తొలిసారి హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఓ యు క్యాంపస్ లో జాబ్ మేళా చేపట్టారు పోలీసులు. నిరుద్యోగ యువతులు ఉద్యోగ అవకాశాలు కోసం ఈ జాబ్ మేళా ను ఉస్మానియా యూనివర్సిటీ లో ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 35 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనీ మహిళలకు, యువతులకు ఇంటర్వ్యూ నిర్వహించారు...

ఊహించని స్పందన...

హైదరాబాద్ లోని ఓ యు క్యాంపస్ లో షీటీమ్స్ మహిళలు, యువతులు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్ మేళా పోలీసులకు ఊహించని స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర సీపీ అంజనీకుమార్ పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. విమెన్ఎంపో హర్ పేరుతో జాబ్ మేళాను షీటీమ్స్ పోలీసులు. ఏర్పాటు చేసారు.

స్కిల్, సెమీ స్కిల్, కమ్యూనికేషన్ బేసిస్ లో ఇంటర్వ్యూలు..

జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ మహిళలు, యువతులతో క్యాంపస్ డిస్టెన్స్ ఎడయుకేషన్ కిక్కిరిసి పోయింది. స్కిల్, సెమీ స్కిల్, కమ్యూనికేషన్ బేసిస్ లో ఇంటర్వ్యూ ప్రాసెస్ లో నిర్వహించారు. దాదాపు 35 కంపెనీలు యువతులను మహిళలను ఉద్యోగావకాశాలు కల్పించడం ముందుకు వచ్చాయి.

అనూహ్య స్పందన

గత మూడేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జాబ్ మేళా కు అనూహ్య స్పందన లభించిందని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.దాదాపు 8000 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ, ఇందులో ఇప్పటికే 4000 మంది ఇంటర్వ్యూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. 35 కంపెనీలు 4000 ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. నేటి యువత చాలా అదృష్టవంతులన్నారు. నిజాయితీ, హార్డ్ వర్క్ ఉంటే విజయం దానంతటదే అదే వస్తోందన్నారు. జాబ్ ఏదైనా‌ సరే ముందు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాకానీ సూచించారు. టీఎంఐతో కలిసి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ నిరుద్యోగ యువతి వినాయోగించుకొవాలి. కాగా జాబ్ మేళా లో ఉద్యోగాలకు ఎంపికైన నిరుద్యోగ యువతులకు ఆఫర్ లెటర్స్ ను అందజేసారు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్.

న్యూయార్క్ కంటే హైదరాబాద్ చాలా సురక్షితమైనది.

ఫిర్యాదు చేయాలనుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కే రానవసరం లేదు.. పెట్రోలింగ్‌ వాహనాలు వద్దనే ఇవ్వొచ్చనీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు.8 వేల మంది కి పై బడి యువతులు మహిళలు ఈ జాబ్ మేళాలో సుమారు 8 వేల మంది కి పై బడి యువతులు మహిళలు తమ బయోడేటాను అందజేశారు. తొలి విడతలో బాగంగా 4 వేల మంది అప్లికేషన్ బయోడేటాను అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories