రైలు వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి

రైలు వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి
x
Highlights

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి స్టేషన్‌లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు...

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి స్టేషన్‌లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ తమ ప్రయాణాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్‌ స్క్రీనింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశాని వెల్లడించింది. చాలా మంది నిర్దేశించిన సమయం కంటే చాలా ముందుగానే రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్నారని, దీని వల్ల రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ నెలకొంటోందని పేర్కొంది.

ప్రయాణికులు సరైన సమయానికే రావాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే ప్రయాణానికి 90 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు రావాలని రైల్వే శాఖ సూచించింది. అయితే, అంతకంటే ముందే కొందరు స్టేషన్లకు పోటెత్తుతుండడంతో ప్రాంగణంలో రద్దీ నెలకొంటోందని దీనితో కొవిడ్ 19 నిబంధనలను ఉల్లంగించినట్లుగా మారుతుందని ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories