కాసేపట్లో పెళ్లి.. ఇంట్లో ఉరి వేసుకుని పెళ్లికూతురు ఆత్మహత్య

* పెళ్లికొడుకు వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు.. అదనపు కట్నం కోసం వేధించాడని ఆరోపణలు

R Tripura Malini
Published on: 11 Dec 2022 11:28 AM IST
Soon To Be Bride Committed Suicide By Hanging Herself At Home
X

కాసేపట్లో పెళ్లి.. ఇంట్లో ఉరి వేసుకుని పెళ్లికూతురు ఆత్మహత్య

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా నవిపేట్‌లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కాళ్సిన పెళ్లికూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌తో ఇవాళ రవళి వివాహం జరగాల్సి ఉంది. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. పెళ్లికూతురుగా ముస్తాబయి, విగతజీవిగా పడి ఉన్న తమ కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే పెళ్లికొడుకు వేధింపులే కారణమని మృతురాలి బంధువులు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం వేధించాడని ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రవళి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story