Adilabad: జైన మతం స్వీకరించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Software Employee Converted To Jainism In Adilabad
x

Adilabad: జైన మతం స్వీకరించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Highlights

Adilabad: తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆత్మ పరిపూర్ణం కోసం జైనమత స్వీకరణ

Adilabad: పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించిన వారిలో దాదాపు అందరూ ఓ ఆడంబర జీవితాన్నే కోరుకుంటారు. కుటుంబాలు, పిల్లల భవిష్యత్‌ అంటూ ఆస్తుల సంపాదనపై దృష్టి పెట్టేవారే చాలా మంది ఉంటారు. కొందరైతే విదేశాల బాట పట్టి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటారు. కానీ ఆదిలాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాత్రం ఆధ్యాత్మిక భావనవైపు ఆకర్షితులయ్యారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 29 ఏళ్ల ట్వింకిల్ కామ్‌దార్‌ అనే యువతి హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నారు. జైనమత గురువు రామ్‌లాల్‌ జీ మహారాజ్‌ బోధనలకు ఆకర్షితులైన ట్వింకిల్‌ జైన మతం స్వీకరించారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆత్మ పరిపూర్ణం చేసుకునేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ట్వింకిల్‌. ఇందులో భాగంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించే మండప పూజ క్రతువులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌.. ట్వింకిల్‌ జైన మతంలో చేరడం అభినందనీయం అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories