Top
logo

జగిత్యాల జిల్లాలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనం!

జగిత్యాల జిల్లాలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనం!
X
Highlights

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మల్యాల మండలం బల్వాంతపూర్‌లోని ఓ ఆలయంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనమయ్యాడు. మృతుడు హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌గా తెలుస్తోంది.

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మల్యాల మండలం బల్వాంతపూర్‌లోని ఓ ఆలయంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనమయ్యాడు. మృతుడు హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌గా తెలుస్తోంది. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పాగిళ్ల పవన్‌ కుమార్ కి బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణితో వివాహమైంది. అయితే పవన్ చిన్న బావమరిది జగన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులను పరామర్శించేందుకు పవన్‌ రాగా, అతడిని సమీపంలో ఉన్న మంజునాథ గుడికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి పెట్రోల్ పోసి తగలబెట్టారు బంధువులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జగన్ పవన్ కుమార్‌కు మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. జగన్ మృతికి పవన్ కారణమని జగన్ భార్య సుమలత ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భాదితురాలు భార్య ఆరోపిస్తుంది.

Web TitleSoftware employee burnout In jagtial district
Next Story