SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం... ఆ నలుగురి పరిస్థితి ఏంటి?

SLBC tunnel roof collapsed near Srisailam, several workers struck in tunnel, Telangana govt monitoring rescue operations
x

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం... 3 మీటర్ల మేర కూలిన సొరంగం పై కప్పు

Highlights

SLBC Tunnel collapsed: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమడ వైపు సొరంగం 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. నాగర్...

SLBC Tunnel collapsed: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమడ వైపు సొరంగం 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో 50 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 43 మంది కార్మికులు బయటకు వచ్చారు. మరో ఏడుగురు లోపలే చిక్కుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. లోపల చిక్కుకున్న వారిలో గుర్జీత్ సింగ్, సన్నీత్ సింగ్, మనోజ్ రూబెన, సందీప్, సంతోష్, శ్రీనివాసులు, జట్కా హీరాన్ ఉన్నారు.

లోపల చిక్కుకున్న వారిలో ముగ్గురిని సహాయక బృందాలు వెలికి తీసుకొచ్చాయి. వెంటనే క్షతగాత్రులను శ్రీశైలంలోని జెన్కో ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో ఆ నలుగురి పరిస్థితి ఏమైందనే ఆందోళన వారి కుటుంబాల్లో కనిపిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అప్‌డేట్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories