తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Six Maoists Killed In Bhadrari Kothagudem
x

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Highlights

Bhadrari Kothagudem: భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరిల్లింది.

Bhadrari Kothagudem: భద్రాద్రి- ములుగు జిల్లాల సరిహద్దు కాల్పుల మోతతో దద్దరిల్లింది. కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన ఇద్దరికీ గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయన దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు.

ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. రఘునాథపాలెం ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories