దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ.. తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ.. తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు
x
Highlights

తెలంగాణలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. రెండు రోజుల పాటు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ నిన్న ఒక్కరోజు 22 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. రెండు రోజుల పాటు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ నిన్న ఒక్కరోజు 22 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ మరో ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1044కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు 24మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 464 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 26 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24గంటల్లో 1755 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 77 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 35,365 మందికి సోకింది. దీని బారి నుంచి 9065 మంది కోలుకోగా.. 1152 మంది మరనించారు.






Show Full Article
Print Article
Next Story
More Stories