ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్ ఛోటూ రామ్ అవార్డు

Sir Chotu Ram Award To Chief Minister KCR
x

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్ ఛోటూ రామ్ అవార్డు

Highlights

* అవార్డు ప్రకటించిన అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు

Hyderabad: ముఖ్యమంత్రికేసీఆర్‌కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు సర్ ఛోటూ రామ్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు కలిసి అవార్డును అందజేశారు. దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయమని ఇందులో విశేషమైన మార్పు రావాలన్నది కేసీఆర్ సంకల్పమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి భూమిని, నీళ్లను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగలదని చెప్పారు. కానీ ప్రస్తుత విధానాలు అందుకు తగ్గట్టుగా లేవన్నారు. ఆహార రంగంలో గొప్ప ఉపాధి అవకాశాలున్నాయని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల కష్టాలలో భాగం పంచుకునే గొప్ప ముఖ్యమంత్రిని కేసీఆర్‌లో చూస్తున్నామని పంజాబ్ రైతులు కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories