సమ్మెకు దిగిన సింగరేణి కార్మికులు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

సమ్మెకు దిగిన సింగరేణి  కార్మికులు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
x
Highlights

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి బొగ్గు గనుల కార్మికులు సమ్మె - మద్దతు పలికిన కార్మిక సంఘాలు - నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి బొగ్గు గనుల కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కార్మికులు నేడు విధులకు గైర్హాజరయ్యారు. బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మె కొనసాగుతోంది. AITCI, NTUC, CIT, UHM, SBNS సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సింగరేణిలో గుర్తింపు పొందిన TBGKS సమ్మెకు మద్దతు ప్రకటించింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 28 భూగర్భ, 18 ఒపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోనూ సమ్మె కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories