Singareni: సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె.. నేటి నుంచి 3 రోజుల పాటు..

Singareni Workers Protest Against Privatization till 11 12 2021 | Telangana Live News
x

Singareni: సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె.. నేటి నుంచి 3 రోజుల పాటు..

Highlights

Singareni: నేటి నుంచి 11వ తేదీ వరకూ 72 గంటల పాటు కొనసాగనున్న సమ్మె...

Singareni: సింగరేణిలో సమ్మె కొనసాగుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగనుంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు 5 జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 12 ఏళ్ల తర్వాత సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు నిచ్చాయి. మూడు రోజుల సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుంది. సుమారు 6.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది.

ప్రైవేటీకరణ పేరుతో సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. సింగరేణిలోని మరో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రయివేట్ పరం కాకుండా అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని యూనియన్ నాయకుల అంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో సింగరేణి సమ్మె కనొసాగుతోంది. గనుల వద్దకు పెద్ద ఎత్తున కార్మిక సంఘం నాయకులు చేరుకొని నిరసనలు తెలుపుతున్నారు.

బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణిలో మూడు రోజుల పాటు సమ్మె కొనసాగుతోంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మోలో పాల్గొన్నారు. ఉదయం షిప్ట్ నుండి 72 గంటలపాటు సమ్మె కొనసాగనుంది. అన్ని భూగర్భ గనులు ఒపెన్ కాస్టుల్లో సమ్మె కారణంగా భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది.

జయశంకర్ భూపాలపల్లి సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి 11వ తేదీ వరకూ 72 గంటల పాటు కార్మిక లోకం సమ్మె నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీకే కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో రోజువారి 11 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు సింగరేణి గనుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories