రీజినల్ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు.. రేపటి నుంచి విధుల్లోకి...

Singareni Workers Meeting with Regional Labour Commissioner | Telangana News
x

రీజినల్ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు.. రేపటి నుంచి విధుల్లోకి...

Highlights

Singareni Workers: వచ్చే నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

Singareni Workers: రీజినల్ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాలు చర్చలు ముగిశాయి. వచ్చే నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. మూడు రోజులపాటు సమ్మె చేసిన సింగరేణి కార్మికులు రేపటి నుంచి విధుల్లోకి హాజరుకానున్నారు. నాలుగు బొగ్గు బ్లాకుల గనుల వేలాన్ని నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగించాయి.

అయితే ఈ అంశం కేంద్ర విధానపర నిర్ణయం కాబట్టి కేంద్రం పరిధిలోనే పరిష్కారం అవుతుందని యాజమాన్యం చర్చల్లో తన తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి నివేదికను ఇవ్వనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఇందుకు సహకారం అందిస్తామని యాజమాన్యం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories