వేడి, ఉక్కపోతతో సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు

వేడి, ఉక్కపోతతో  సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు
x
Highlights

అసలే ఎండలు.. ఆపై బొగ్గు పొరలు ఇక చెప్పేదేముంది.. సింగరేణి ఉపరితల గనులు మండిపోతున్నాయి. ఓసీలు పొగలు కక్కుతున్నాయి సింగరేణి ప్రభావిత ప్రాంతాలు...

అసలే ఎండలు.. ఆపై బొగ్గు పొరలు ఇక చెప్పేదేముంది.. సింగరేణి ఉపరితల గనులు మండిపోతున్నాయి. ఓసీలు పొగలు కక్కుతున్నాయి సింగరేణి ప్రభావిత ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి.. భానుడి ప్రతాపానికి క్వారీల్లో పని చేసే ఉద్యోగులు ఉడికిపోతున్నారు. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. మండువేడిమిలో సింగరేణి కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్‌ స్టోరీ

ప్రచండమైన ఎండలకు తోడు దడ పుట్టించే వడగాలులకు భద్రాద్రి కొత్తగూడెజిల్లా ఉడికిపోతోంది. రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడి ఊరటనిచ్చినా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. ఎండలధాటికి తట్టుకోలేక రోడ్డుపైకి జనం రాలేని పరిస్థితులుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఓపెన్‌కాస్టుల్లో పనిచేసే బొగ్గుగని కార్మికులకు ప్రాణసంకటంలా మారాయి. 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వేడి, ఉక్కపోతతో సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు.

మణుగూరులో లాక్‌డౌన్‌ కారణంగా గనుల అండర్‌ గ్రౌండ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. ఇటీవలే ఒపెన్‌ కావడంతో అధికారులు ఉత్పత్తిపై దృష్టిసారించారు. ఎన్నడూలేని విధంగా ప్రచండభానుడు ఉగ్రరూపందాల్చినా సింగరేణి కార్మికులు పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓవైపు వడగాలులు మరోవైపు బొగ్గు మంటలతో ఒపెన్‌ కాస్టు గనులు ఆవిరిలు చిమ్ముతున్న పనులు చేస్తున్నారు.

ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని సైతం పక్కనబెట్టి చెమటోడుస్తున్న నల్ల సూర్యుల రక్షణకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. కనీసం మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, కూల్‌వాటర్‌ కూడా అందుబాటులో ఉంచడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కార్మికుల పని వేళలను మార్చాలని వాపోతున్నారు.

ఇటు ఎండలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు సింగరేణి మేనేజ్‌మెంట్‌. ఉపరితల గనుల్లో రెస్టు షెల్టర్లను ఏర్పాటు చేశామంటున్నారు. చీకటి గుహల్లాంటి గనుల్లో ప్రకృతికి విరుద్దంగా పనిచేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సింగరేణి కార్మికులు. గాలి, వెలుతురు లేని పనిస్థలాల్లో గడ్డపారలు తమ చెమటతో తడిసినా నిప్పుల కుంపటి లాంటి గనిలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ బతుకుపోరాటం సాగిస్తున్నా పట్టించుకోవడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories