logo
తెలంగాణ

Nirmal: నిర్మల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నలుగురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

Show Cause Notices to Nirmal District Government Hospital Doctors
X

Representational Image

Highlights

Nirmal: నిర్మల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న నలుగురు వైద్యులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న నలుగురు వైద్యులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఫిర్యాదు మేరకు డాక్టర్లు రవి, ముఖేష్, అమర్, ప్రమోద్‌చంద్రలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సమయపాలన పాటించకుండా సొంత ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారని ఫిర్యాదు రావడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Web TitleShow Cause Notices to Nirmal District Government Hospital Doctors
Next Story