జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు: చాకలి ఐలమ్మ మునిమనవరాలు హత్యకు గురైన ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు: చాకలి ఐలమ్మ మునిమనవరాలు హత్యకు గురైన ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు
x

జీడిమెట్ల మదర్ మర్డర్ కేసు: చాకలి ఐలమ్మ మునిమనవరాలు హత్యకు గురైన ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

Highlights

హైదరాబాద్‌ జీడిమెట్లలో చోటు చేసుకున్న తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన ఘటన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చాలా దారుణమైనది.

Jeedimetla Mother Murder Case : హైదరాబాద్‌ జీడిమెట్లలో చోటు చేసుకున్న తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన ఘటన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చాలా దారుణమైనది. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం ఈ కేసును మరింత శోకాంతకంగా మార్చింది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బాలిక తల్లి అంజలిపై కోపంతో ఈ చర్యకు పాల్పడింది. కారణం – తల్లి తాను ప్రేమిస్తున్న యువకుడు శివతో సంబంధాన్ని నిరుత్సహించడమే. బాలిక ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో పరిచయమై ప్రేమలో పడింది. అంజలి ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. చదువుకునే వయసులో ప్రేమ అనవసరమని తల్లి చెప్పడంతో బాలిక ఆమెపై ద్వేషంతో నిండిపోయింది.

ఐదు రోజుల క్రితమే బాలిక శివతో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరినీ పట్టుకుని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. కుటుంబ సభ్యులు శివను స్టేషన్‌లోనే ఉంచమని కోరినా, పోలీసులు తర్వాత అతడిని విడిచిపెట్టినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో, నిన్న సాయంత్రం బాలిక స్వయంగా శివకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. శివ రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత, ఈ ఉదయం అంజలి పూజలో ఉండగా బాలిక అతడిని పిలిపించింది. పూజ చేస్తున్న సమయంలో ఆమె చున్నీతో తల్లి తల చుట్టి గుద్దింది. తర్వాత శివ వెళ్లిపోయాడు. అయితే అంజలి ఇంకా చనిపోలేదని తెలిసి బాలిక మళ్లీ శివను పిలిచి, “మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది.. వచ్చి చంపేయ్” అని చెప్పిందట.

ఆ తర్వాత శివ మళ్లీ వచ్చి సుత్తెతో అంజలిని తల, ముక్కుపై గట్టిగా కొట్టాడు. శివ తమ్ముడు కూడా అక్కడికి వచ్చి ఆమె గొంతు కోసి హత్యకు సహకరించాడు. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ హత్యకు బాలిక ప్లాన్ వేసినట్టు మృతురాలి అక్క వెల్లడించారు. చిన్న కుమార్తెను బయటకు పంపించి ఈ హత్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మా చెల్లికి న్యాయం చేయాలి” అంటూ ఆమె రోధించారు.

ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శివతో పాటు అతని తమ్ముడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం, కుటుంబంలో అవగాహన లోపం వంటి అంశాలపై పెద్ద చర్చ ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories