She cabs: పేదింటి మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు షీ క్యాబ్స్ పథకం

She cabs: పేదింటి మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు షీ క్యాబ్స్ పథకం
x

She cab

Highlights

She cabs: * రూ.8 లక్షలు విలువ చేసే ఒకో కారు 18 మందికి పంపిణీ * ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు సబ్సిడీ పై కార్ల పంపిణీ * ఎంపికైన మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీ

She cabs: అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. అలాంటి మహిళామణులకు చేయుతగా ఎస్సీ కార్పొరేషన్‌ 'షీ క్యాబ్స్‌' పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చి కార్ లను అందజేసారు.

ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు విజేతులుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఉత్సాహం ఉన్న పేదింటి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 'షీ క్యాబ్స్‌' పథకం ప్రారంభమైంది. తొలి విడతలో దరఖాస్తు చేసి శిక్షణ పూర్తి చేసిన సుమారు 18 మందికి 8 లక్షల విలువైన కార్లను సబ్సిడీపై అందించారు.తమ జీవితాన్ని ఉన్నతంగా మల్చుకోవడంతో పాటు సాటి మహిళలను క్షేమంగా ఇంటికి చేర్చుతామంటున్నారు క్యాబ్ డ్రైవర్ లు గా మారిన మహిళలు.

మహిళలకు అందజేసిన కార్లలో జీపీఎస్‌ వసతి, ఆఫ్రాన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు మహిళలకు రక్షణగా పెప్పర్‌ స్ప్రేలను ఏర్పాటు చేసారు.ఇక్కడ పథకం అమలు తీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చెస్తామన్నారు అధికారులు.ఈ పథకం కోసం 18-45 ఏండ్ల వయసున్న మహిళలను లబ్దిదారులుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి 'ఎస్‌బీఐ ఆర్‌ సెట్టీ' సహకారంతో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories