షర్మిల దీక్షను భగ్నంచేసిన పోలీసులు.. అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స

* దీక్షలో షర్మిలకు ఆరోగ్యంక్షీణిస్తోందని డాక్టర్ల అభిప్రాయం.. అర్థరాత్రి దాటిన తర్వాత దీక్ష భగ్నం

R Tripura Malini
Published on: 11 Dec 2022 7:17 AM IST
She Was Taken To Apollo Hospital For Treatment
X

షర్మిల దీక్షను భగ్నంచేసిన పోలీసులు.. అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స

YS Sharmila: లోటస్ పాండ్‌లో షర్మిల దీక్షను పోలీసు భగ్నంచేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు పోలీసులు అవకాశం కల్పించలేదని దీక్షకు పూనుకున్న షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యుల సూచనతో దీక్షను భగ్నంచేశారు. లోటస్ పాండ్‌లోని ఆమె నివాసంలో దీక్షలో ఉన్న షర్మిలను అర్థరాత్రిదాటిన తర్వాత సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకున్న తల్లి విజయమ్మ, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షర్మిలను పరామర్శించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రకు ఆంక్షలతోకూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పోలీసులు అడ్డుకోవడం దారుణమని విజయమ్మ విచారం వ్యక్తంచేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story