హన్మకొండలో శతచండి సహిత అతిరుద్రయాగం

హన్మకొండలో శతచండి సహిత అతిరుద్రయాగం
x
yagam
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో శతచండి సహిత అతిరుద్రయాగం ప్రారంభం అయ్యింది.వేద పండితులు రుద్రపారాయణం పఠిస్తూ శంకరుడిని...

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో శతచండి సహిత అతిరుద్రయాగం ప్రారంభం అయ్యింది.వేద పండితులు రుద్రపారాయణం పఠిస్తూ శంకరుడిని అభిషేకంతో పూజలు చేశారు. శృంగేరి పీఠం నుండి వచ్చిన 40 మంది రుత్వికులతో పాటు 108 మంది వేద పండితులు యాగ వేడుకల్లో పాల్గొన్నారు.

యాగ నిర్వహాకులు రోజారాణి, శ్రీనివాసం దంపతుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు యాగం నిర్వహించనున్నారు. ఓరుగల్లులో అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేసిన యాగంతో తెలంగాణ రాష్ర్ట సుభిక్షంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో రాష్ర్ట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories