Hyderabad: సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌ను సీజ్‌ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Secunderabad Alpha Hotel Seized
x

Hyderabad: సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌ను సీజ్‌ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Highlights

Hyderabad: పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఆల్ఫా హోటల్

Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పాడైన ఆహార పదార్థాలను విక్రయించి వినియోగదారుల అనారోగ్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో, తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్ నిత్యం రద్ధీతో ఉంటోంది. ఇక్కడ ఆహారపదార్థాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించకపోగా, నిల్వఉన్న పదార్థాలను విక్రయించడంతో అవి అనారోగ్య సమస్యకు దారితీస్తు్న్నాయి.

అల్ఫా హోటల్‌లో కీమా రోటీ తిన్న మహ్మద్ కొద్ధిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరోచనాలతో అల్ఫా హోటల్లోనే విలవిల్లాడిపోయాడు. పాడైన రోటీ దుర్వాసన వెదజల్లుతోందని వినియోగదారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అల్ఫా హోటల్ చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అల్ఫా హోటల్ యజమాని జమాలుద్ధీన్‌పై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories