కరోనా ఎఫెక్ట్ : కొత్త కారొద్దు.. సెకండ్ హ్యాండ్ కారే ముద్దు

కరోనా ఎఫెక్ట్ : కొత్త కారొద్దు.. సెకండ్ హ్యాండ్ కారే ముద్దు
x
Highlights

కరోనా వచ్చిన తర్వాత జనాల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది.

కరోనా వచ్చిన తర్వాత జనాల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. తినే ఆహారం విషయంలో రుచి కంటే సుచికే ఓటేస్తున్నారు. ఇక జర్నీ విషయంలో సొంత వెహికలే బెటర్ అంటున్నారు. డబ్బులు పోయిన పర్వాలేదు. కారు జర్నీయే సేఫ్ అంటున్నారు. దీంతో నగరంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. కారుకు సేల్‌ బోర్డు తగిలించగానే కొనుగోలుదారులు వాలిపోతున్నారు.

కరోనా ఎంటరయ్యాక జర్నీ అంటేనే జడుసుకుంటున్నారు సిటీ జనాలు. బస్సెక్కిన, మెట్రో రైలెక్కిన ఏ వైరస్‌ ఎటు నుంచి తగులుతుందో అని జనాలు భయపడిపోతున్నారు. దీంతో సొంత వాహనాలే బెటర్ అంటున్నారు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నవారు బైక్‌ పై జర్నీ అంటే అంతా ఈజీ కాదు. ఈ ట్రాఫిక్ నగరంలో బైక్‌ రైడింగ్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే డబ్బులు పోయినా పర్వాలేదు కార్లు కొనేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు జనాలు.

బైక్‌ జర్నీ అంత సేఫ్‌ కాదు. కొత్త కారు కొనే పరిస్థితి లేదు. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు జనాలు. న‌గ‌రంలోని కోఠీ, సుల్తాన్ బ‌జార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మాదాపూర్, కూక‌ట్‌ప‌ల్లి వంటి ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

కరోనా వైర‌స్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణం చేయాలంటే భ‌యంగా ఉంటుందంటున్నారు ప్ర‌జ‌లు. ఫ్యామిలీతో బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సొంత వాహ‌న‌మే బెట‌ర్ అంటున్నారు. దీంతో పాటు బైక్ తీసుకుంటే కేవలం ఇద్ద‌రు మాత్ర‌మే ప్ర‌యాణం చేయాల‌ని. అదే డ‌బ్బులు సెకెండ్ హ్యాండ్ కార్ల‌కు పెడితే ఫ్యామిలీ మొత్తం ప్ర‌యాణించవచ్చని వాహనదారులు ఆలోచిస్తున్నారు. వైర‌స్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో కొంత డ‌బ్బులు ఎక్కువైనా సొంతంగా కారు కొన‌డానికే మొగ్గు చూపుతున్నారు న‌గ‌ర వాసులు.

క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గినా ప్ర‌జార‌వాణాపై మొగ్గు చూప‌ట్లేరు న‌గ‌ర‌వాసులు...క‌రోనాకు ముందు మెట్రోలో 4.5 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణాలు సాగించేవారు...కానీ ఇప్పుడు ఆ సంఖ్య 1.6 ల‌క్ష‌ల‌కు దాట‌డం లేదు...ఇక ఆర్టీసీ విష‌యానికొస్తే నిత్యం 30 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణాలు సాగించేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది..కేవ‌లం 60-70 శాతం మాత్ర‌మే ప్ర‌యాణాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది....దీంతో సొంత వాహ‌నాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్ర‌జ‌లు.

కోవిడ్ స‌మ‌యం నుండి సెకెండ్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయ‌ని.. గ‌తంలో కంటే మార్కెట్ పెరిగింద‌ని సెకెండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్ వారు అంటున్నారు.న‌గ‌రంలో 2 ల‌క్ష‌ల నుండి 20 ల‌క్ష‌ల విలువ చేసే కార్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయంటున్నారు...క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌ధ్యంలో క‌స్ట‌మ‌ర్లు కూడా సొంత కారు కొనుక్కోవ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నార‌ని అంటున్నారు....తాము కూడా ప్ర‌జ‌ల డిమాండ్ కు అనుగుణంగా అన్నీ బ్రాండ్ కార్ల‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్నామ‌ని మార్కెట్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే కార్లు అందుబాటులో ఉంటున్నాయ‌ని అంటున్నారు....



Show Full Article
Print Article
Next Story
More Stories