వరంగల్ జిల్లాను వణికిస్తున్న సీజనల్ జ్వరాలు

Seasonal Fevers In Warangal District
x

వరంగల్ జిల్లాను వణికిస్తున్న సీజనల్ జ్వరాలు

Highlights

Warangal: పేషెంట్లతో కిటకిటలాడుతున్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాను సీజనల్ జ్వరాలు వణికిస్తున్నాయి. పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రుల దాకా జనం జ్వరాలతో పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుండగా.. ప్రైవేటులో 25 శాతం మంది ట్రీట్‌మెంట్ కోసం జాయిన్ అవుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పేషెంట్లతో కిటకిటలాడుతున్న వైనంపై hmtv స్పెషల్ స్టోరీ.

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్‍ ఎంజీఎం ఆసుపత్రి‌లో పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి ట్రీట్‌‌మెంట్ చేస్తున్నారు. ఇప్పటికే బెడ్ల కొరత ఉండటం, పేషెంట్ల సంఖ్య పెరిగిపోవడంతో.. ఏం చేయాలో తెలియక ఉన్న బెడ్లపైనే పిల్లలకు ట్రీట్‌‌మెంట్ చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ టైమ్‌‌లో గంటల తరబడి ఓపీ కోసం ఎదురుచూడలేక చిన్నారులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.

పిల్లలకు టెస్టులు, స్కానింగ్‌లు రాసే క్రమంలో అంతేస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఒక్కొక్కరి రిపోర్ట్ రావడానికి గంటల టైం పడుతోంది. అప్పటివరకు అసలు ట్రీట్‍మెంట్‍ ఆగుతోంది. జ్వరంతో పిల్లలు, గంటల తరబడి నిల్చోలేక పేరెంట్స్‌ వాలిపోతున్నారు. ప్రస్తుతం వరంగల్‍ ఎంజీఎం పీడియాట్రిక్‍ విభాగంలో 120 బెడ్లు అందుబాటులో ఉండగా.. 30 బెడ్లకు ఒక యూనిట్‍ చొప్పున 4 యూనిట్ల డాక్టర్ల బృందం పని చేస్తోంది. ఒక్కో బెడ్‍ మీద ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా పేషెంట్ల సంఖ్య పెరగడంతో హస్పిటల్‍ అధికారులు అందుబాటులో ఉన్న పీజీలు, హౌస్ సర్జన్లతో నెట్టుకొస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడంలేదు.

హస్పిటల్‌లో బెడ్ల కొరత, వైద్య సిబ్బంది లేకపోవడం వంటి కారణాలతో డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు పేషెంట్లను జ్వరం తగ్గకముందే డిశ్చార్జ్‌ చేస్తున్నారు. మామూలు జ్వరానికి కోలుకోడానికే మినిమం మూడు రోజులు పడుతుండగా.. వైరల్‍ ఫీవర్స్ బాధితుల పూర్తిస్థాయి చికిత్సకు మరో రెండు రోజులు ఎక్కువ పడుతోంది. డైలీ ఓపీ, అడ్మిట్‍ అయ్యే పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో సగం ట్రీట్‍మెంట్‍ దాటగానే హోం కేర్ సజెస్ట్ చేస్తున్నారు. అందుబాటులో ఉండే మందులు ఇవ్వడానికి తోడు బలం పెరగడానికి అవసరమైన సిరప్‍ వంటివి రాస్తున్నారని పేషంట్లు చెబుతున్నారు..

ఏదేమైనా సీజనల్ ఫీవర్స్‌తో ప్రజలు వణికిపోతుంటే.. బెడ్స్ సరిపోక వరంగల్ ఎంజీఎం పేషంట్లతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి జ్వరపీడితులకు సరైన సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories