ఆపరేషన్‌ కర్రెగుట్ట..హెలికాప్టర్ల ద్వారా ఫ్లాష్‌ బాంబులతో బలగాల దాడులు

Search Continues on Karregutta
x

ఆపరేషన్‌ కర్రెగుట్ట..హెలికాప్టర్ల ద్వారా ఫ్లాష్‌ బాంబులతో బలగాల దాడులు

Highlights

హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్‌ బాంబులతో దాడులు చేస్తున్నారు. కమ్యూనికేషన్ కోసం సమీప ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేశారు.

Karregutta: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. 11రోజులుగా కొనసాగుతున్న ఈ సెర్చింగ్ ఆపరేషన్‌‌లో ఇప్పటికే రెండు గుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. అయితే పెద్ద మొత్తంలో కొండలు, సొరంగాలు ఉండటంతో కూంబింగ్‌కు ఇబ్బంది పడుతున్నాయి బలగాలు. దాంతో హెలికాప్టర్లు, డ్రోన్లపైనే ఆధారపడి సెర్చ్ చేస్తున్నారు.

హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్‌ బాంబులతో దాడులు చేస్తున్నారు. కమ్యూనికేషన్ కోసం సమీప ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే మావోయిస్టులు సేఫ్‌జోన్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుండగా... సమీపంలోని గ్రామాల ప్రజలు ఎవరూ వారికి సహకరించవద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories