Charminar: 21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు

School Students Who Stole 21 Kg Of Brownies
x

Charminar: 21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు

Highlights

Charminar: సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు

Charminar: వినాయక చవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. పలు రకాల గణేష్‌లు విశేష పూజలందుకుంటున్నారు. గణనాథులకు భారీ ఎత్తున లడ్డూలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లడ్డూలు చోరీలకు గురవుతున్నాయి. మండపాలలో విఘ్నేశ్వరుడి చేతిలోని లడ్డూలను తస్కరిస్తున్నారు. చార్మినార్ ఝాన్సీ బజార్‌లో వినాయక మండపం వద్ద 21 కేజీల లడ్డూ చోరీకి గురైంది. చోరీకి పాల్పడ్డ వారు పాఠశాల విద్యార్థులు కావడం విశేషం. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదయ్యాయి. గణేష్ మండపం నిర్వాహకుడు శ్యామ్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories