SC Railway: తెలంగాణలో వర్షాల ప్రభావం – రైళ్ల రద్దు, దారి మళ్లింపు

హైదరాబాద్‌: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని మార్గం మళ్లించింది.

Ramya Vegirouthu
Published on: 27 Aug 2025 6:17 PM IST
SC Railway: తెలంగాణలో వర్షాల ప్రభావం – రైళ్ల రద్దు, దారి మళ్లింపు
X

SC Railway: తెలంగాణలో వర్షాల ప్రభావం – రైళ్ల రద్దు, దారి మళ్లింపు

హైదరాబాద్‌: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని మార్గం మళ్లించింది.

బుధవారం కరీంనగర్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, కాచిగూడ–మెదక్‌, మెదక్‌–కాచిగూడ, బోధన్‌–కాచిగూడ, ఆదిలాబాద్‌–తిరుపతి సర్వీసులను రద్దు చేశారు. గురువారం నిజామాబాద్‌–కాచిగూడ రైలు కూడా రద్దు కానుందని అధికారులు వెల్లడించారు. అదనంగా మహబూబ్‌నగర్‌–కాచిగూడ, షాద్‌నగర్‌–కాచిగూడ సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు.

కామారెడ్డి–బికనూర్‌–తలమడ్ల, అకన్పేట్–మెదక్‌ ట్రాక్‌లపై వరదనీరు ప్రవహించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దు, దారి మళ్లింపు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు:

కాచిగూడ: 9063318082

నిజామాబాద్: 970329671

కామారెడ్డి: 9281035664

సికింద్రాబాద్: 040-27786170

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story