ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను సైతం కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపాలకు గోదావరి జలాలతో నివాళులర్పించారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురువేశారు.

పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి మహమూద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ తల్లికి పూలవేసారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వికారాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు గౌడ్‌ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమరవీరుల స్మారక చిహ్నానికి నివాళులు అర్పించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్టొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం హన్మకొండలోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నదని ఆయన అన్నారు. కేసీఆర్ పుణ్యమాని సాగునీటితో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ నాయకత్వంలో అనేక మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని అన్నారు.

నిర్మల్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురువేశారు. ఎంతోమంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో రాష్ర్టాన్ని సాధించుకోగలిగామన్నారు. ప్రజలకు రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమర వీరులకు నివాళులర్పించారు.

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన వేడుల్లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమర వీరులకు నివాళులర్పించారు.

మహబూబాబాద్‌ నిర్వహించిన వేడుల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమర వీరులకు నివాళులర్పించారు.

మెదక్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

మ‌హ‌బూబాబాద్‌‌ లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహబూబాబద్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories