Sankranthi 2021: సంక్రాంతికి ఊరిబాట పట్టిన ప్రజలు

People Traveled to villages for Festival
x

Vehicles at tollgate

Highlights

Sankranthi 2021: * కరోనా నేపథ్యంలో సొంత వాహనానికి ప్రాధాన్యత * గతేడాది కంటే భారీగా పెరిగిన వాహనాలు * టోల్‌గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ, వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి ఏపీకి పయణం అవుతున్నారు. కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు ప్రజలు వాహనాల్లో బయలుదేరారు. దీంతో టోల్‌గేట్ల దగ్గర రద్దీ పెరిగింది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటకీ హైదరాబాద్‌- విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు 3 నుంచి 4 వేల వాహనాలు ప్రయాణిస్తే, సంక్రాంతి రోజుల్లో 10 నుంచి 18 వేల వాహనాలు వస్తాయని టోల్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే దారిలో చౌటుప్పల్ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కొర్ల పహాడ్, కృష్ణా జిల్లా చిల్లకల్లు, కీసర దగ్గర టోల్ గేట్లు ఉన్నాయి. ఏపీకి వెళ్లే దారిలో ప్రధానంగా ఈ జాతీయ రాహదారి ఉండడంతో ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రతీఏటా పండుగ సీజన్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదని వాహదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ఫాస్టాగ్ పని చేయకపోవడంతో టోల్ గేట్ సిబ్బందితో గొడవపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories