logo
తెలంగాణ

Agneepath Protests: పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు

Sai Defence Academy Director In Police Custody | TS News
X

Agneepath Protests: పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు

Highlights

Agneepath Protests: అల్లర్లకు సుబ్బారావు కీలక సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు

Agneepath Protests: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. సికింద్రాబాద్‌ విధ్వంసానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డిఫెన్స్ కోర్సుల్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సుబ్బారావును ఖమ్మం నుంచి నరసరావుపేటకు తరలించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు సుబ్బారావు వచ్చినట్టు సమాచారం సేకరించారు. ఇదిలా ఉంటే ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులు షల్టర్ తీసుకునట్టు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు విద్యార్థులు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. మరోవైపు విద్యార్థులకు వాటర్‌బాటిల్స్‌, బటర్‌ మిల్క్‌, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్‌ ఆర్మీ కోచింగ్‌ అకాడమీలు సప్లయ్‌ చేసినట్టు సమాచారం సేకరించారు. సికింద్రాబాద్‌ అల్లర్లలో మొత్తం 10 డిఫెన్స్‌ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొనట్టు పోలీసులు గుర్తించారు.

Web TitleSai Defence Academy Director In Police Custody | TS News
Next Story