నటి శ్రావణి కేసు : సాయి, దేవరాజ్‌ అరెస్ట్!‌

నటి శ్రావణి కేసు : సాయి, దేవరాజ్‌ అరెస్ట్!‌
x
Highlights

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రావణి ప్రియుడిగా భావిస్తున్న దేవరాజ్ రెడ్డి, ఈ కేసుతో..

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రావణి ప్రియుడిగా భావిస్తున్న దేవరాజ్ రెడ్డి, ఈ కేసుతో సంబంధం ఉన్న సాయికృష్ణారెడ్డిని సంజీవ నగర్ ( ఎస్సార్ నగర్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే శ్రావణి ఆత్మహత్యలో తన ప్రమేయం ఏమి లేదని. శ్రావణితో పాటు ఆమె కుటుంబసభ్యులకు కేవలం అండగా మాత్రమే ఉన్నానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు దేవరాజ్‌రెడ్డిని విచారించిన పోలీసులు అతడి వద్ద కొన్ని వీడియోలు, ఫోన్ కాల్ రికార్డింగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి, దేవరాజ్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను‌ నమోదు చేశారు. ఇదిలావుంటే గతంలో శ్రావణి, సాయికృష్ణారెడ్డిలు ప్రేమించుకున్నారని.. దేవరాజ్ రెడ్డి మధ్యలో ఎంట్రీ ఇవ్వడంతోనే వ్యవహారం తారుమారైందని మరో కథనం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కోణంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదిలావుంటే తమ కుమార్తె మరణానికి దేవరాజరెడ్డే కారణమని శ్రావణి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు దేవరాజ్‌ మాత్రం సాయి వేదింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని వాదిస్తున్నాడు. ఇక ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ఇద్దరు అనుమానితులూ తమ అదుపులోనే ఉంటారని ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories