న్యూ ఇయర్ లో వినియోగదారులకు చేదుకబురు!

న్యూ ఇయర్ లో వినియోగదారులకు చేదుకబురు!
x
ప్రతీకాత్మక చిత్రం 
Highlights

* పెరగనున్నటీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషిన్ల ధరలు * జనవరి నుంచి 10 శాతం దాకా పెరిగే అవకాశం * పెరిగిన ముడిపదార్థాల ధరలు, రవాణా చార్జీలు

ఎల్‌ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్‌ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి.

ధరల పెంపు అనివార్యమంటూ ఎల్‌జీ, ప్యానసోనిక్, థామ్సన్‌ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు అని ప్యానసోనిక్‌ ఇండియా తెలిపింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.

గృహోపకరణాల ధరలు పెంచినట్టయితే వచ్చే త్రైమాసికంలో వీటికి డిమాండ్‌ తగ్గే అవకాశాలున్నాయని వినియోగదారుల ఎలక్ర్టానిక్స్‌, అప్లయెన్సెస్‌ తయారీదారుల సంఘం హెచ్చరించింది. ప్రస్తుతం స్తబ్ధంగా ఉన్న డిమాండ్‌ను పెంచుకోగలిగితే ఈ ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గించుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ధరల ఒత్తిడి ఎంతో కాలం ఉండదని, వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం గృహోపకరణాల మార్కెట్‌ పరిమాణం రూ.76,400 కోట్లుగా ఉండగా అందులో దేశీయ తయారీ రంగం వాటా రూ.32,200 కోట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories