Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది

Sabitha Indra Reddy Says BRS Government is Giving Importance to Education
x

Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది

Highlights

Sabitha Indra Reddy: విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నాం

Sabitha Indra Reddy: తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే దృక్పథంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హాస్టళ్లు, కొత్త భవనాలను నిర్మిస్తూ విద్యార్థుల వసతికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. ఓయూ ఇంజనీరింగ్‌ విద్యార్ధుల కోసం సుమారు 39 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన హాస్టల్‌లో 5 వందల మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories